రవితేజ సినిమా తర్వాత ఆ ప్రేమకథతో...
on Apr 24, 2020

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తమిళ సినిమాను 'రాక్షసుడు'గా దర్శకుడు రమేష్ వర్మ రీమేక్ చేశారు. ఓ విజయం అందుకున్నారు. అయితే... బెల్లంకొండ హీరోగా సినిమా అనుకున్నప్పుడు రీమేక్ అనుకోలేదు. ఓ చక్కటి ప్రేమకథతో సినిమా తీద్దామని అనుకున్నారు. మధ్యలో రీమేక్ చేయమనడంతో అది చేశారు. ఆ విజయం తర్వాత మరోసారి మాస్ మహారాజ రవితేజను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకు వచ్చింది. దాంతో ఆ సినిమా పనులలో పడ్డారు. అలాగని, ముందు రాసుకున్న ప్రేమకథను తిక్కన పెట్టలేదట. లాక్ డౌన్ సమయంలో కథకు మెరుగులు దిద్దారట. రవితేజతో సినిమా పూర్తయిన తర్వాత ఆ ప్రేమకథతో సినిమా తెరకెక్కిస్తాననీ, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేననీ రమేష్ వర్మ చెబుతున్నారు.
"కొంతమంది దర్శకులకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అలా, నాకు ఆ ప్రేమకథను తెరకెక్కించాలి అనేది డ్రీమ్. అదొక అందమైన రొమాంటిక్ డ్రామా. ఇటీవల కొన్నేళ్లుగా ప్రేక్షకులు అనుభూతి చెందని ఒక ప్రేమకథ. స్టోరీ స్పాన్ పెద్దది. ఫారిన్ నేపథ్యంలో కథ సాగుతుంది. రొమాంటిక్ యంగ్ హీరో అందులో నటిస్తారు. రవితేజతో సినిమా పూర్తయ్యే వరకు ఆ హీరో ఎవరనేది చెప్పను" అని రమేష్ వర్మ అన్నారు. రవితేజతో రమేష్ వర్మ తీయబోయే సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



