'భమ్ భోలేనాథ్' తో సక్సెస్ ట్రాక్ లోకి వస్తా: నవదీప్
on Feb 27, 2015
నవదీప్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన చి్త్రం భమ్ భోలేనాథ్. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని నవదీప్ ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెన్స్ గా వున్నారు. కథల ఎంపికలో పొరపాట్ల వల్లే గత కొంతకాలంగా ఆశించిన విజయాలు దక్కలేదని, ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని అంటున్నారు హీరో నవదీప్. ''ఒకదానికొకటి సంబంధం లేని మూడు కథలు, మూడు జీవితాల సమాహారమే భమ్ భోలేనాథ్ సినిమా. పతాకసన్నివేశాల్లో అనుకోని సంబంధం ఏర్పడుతుంది. దానివల్ల అందరూ చిక్కుల్లో పడతారు. వాటి నుంచి మూడు కథల్లో పా్తల్రు ఎలా బయటపడ్డారన్నది ఆసక్తికరం. కథనప్రధాన చి్తమ్రిది. ఉత్కంఠభరితంగా సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్. డ్రగ్‌స నేపథ్యంలో సాగే పతాకఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని''హీరో నవదీప్ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
