మెగా హీరో 'కంచె' మొదలెట్టాడు
on Feb 27, 2015
ముకుంద సినిమాతో తెరపైకి వచ్చిన మెగా హీరో.. వరుణ్‌తేజ్. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వరుణ్ - క్రిష్ కలయికలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని నానాక్‌రామ్ గూడా హౌస్ సెట్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ఖరారు చేశారు. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. దేశభక్తి, ప్రేమ, రొమాన్స్... ఈ అంశాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. వరుణ్ తేజ్ పక్కన ప్రగ్వాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మిర్చిలాంటి కుర్రాడు సినిమాలో కథానాయికగా చేసిన ప్రగ్వా ఓ మోడల్ కూడానూ. త్వరలోనే కంచె రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
