దసరా రేసులో నాని!
on Jul 25, 2016
.jpg)
ఇప్పటికే దసరా రేసులో ఖర్చీఫులు వేసుకొని మరీ రెడీ అయిపోయారు ముగ్గురు యంగ్ హీరోలు. రామ్ చరణ్ "ధృవ", రామ్ "హైపర్", కళ్యాణ్ రామ్ "ఇజమ్" చిత్రాలు దాదాపుగా దసరా విడుదలకే సన్నాహాలు చేసుకొంటుండగా.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా "నేను సైతం" అంటూ సెప్టెంబర్ రేసులో దూకబోతున్నాడు. విరించివర్మ దర్శకత్వంలో నాని నటిస్తున్న "మజ్ను" చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.
నాని ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా నటిస్తుండగా.. మలయాళ ముద్దుగుమ్మ అను కథానాయికగా కనువిందు చేయనుంది. అలాగే.. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి ఓ ప్రత్యేక అతిధి పాత్రలో మెరవనున్నారని వినికిడి. అసలే వరుస హిట్లతో మాంచి ఊపుమీదున్న నాని నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆల్మోస్ట్ అందరి కళ్ళూ "మజ్ను"పైనే ఉన్నాయి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



