పోలీస్ రాజాతో అక్ష సరసాలు!
on Jul 25, 2016
"రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా" లాంటి సినిమాలతో సూపర్ ఫామ్ లో శర్వానంద్ ప్రస్తుతం చంద్రమోహన్ అనే యువదర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుండగా.. శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్రంలో "యువత" ఫేమ్ అక్ష ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. కథలో చాలా కీలకమైన పాత్ర కావడంతో రెమ్యూనరేషన్ గురించి కూడా ఆలోచించకుండా అక్ష ఈ సినిమా ఒప్పేసుకుందట. "గోల శీను" తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాక అక్ష సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఒప్పేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. ప్రస్తుతం అక్ష హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది!