కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా!
on Oct 3, 2024
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబం, సమంత తో పాటు సినీ పరిశ్రమంతా ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె తీరుని తప్పుబట్టారు. తాను హద్దుమీరి దారుణ వ్యాఖ్యలు చేశానని ఆలస్యంగా గ్రహించిన కొండా సురేఖ.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ కామెంట్స్ చేసిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖపై నాగార్జున (Nagarjuna) పరువునష్టం దావా వేశారు. తమ కుంటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే పరువు నష్టంగా డబ్బులు డిమాండ్ చెయ్యని నాగార్జున.. ఆమెని చట్టపరంగా శిక్షించాలని మాత్రమే కోరారు.
Also Read