దేవర సక్సెస్ పార్టీ.. గెస్ట్ లు ఎవరంటే..?
on Oct 3, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. హిట్ స్టేటస్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సినిమా రంగంలోని ప్రముఖులకు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని సక్సెస్ పార్టీ ఇస్తున్నారు. (Devara Success Party)
నిజానికి దేవర సక్సెస్ మీట్ ని అభిమానుల సమక్షంలో అవుట్ డోర్ లో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దసరా కావడంతో అనుమతి లభించలేదు. దీంతో సక్సెస్ మీట్ ప్లాన్ ని విరమించుకొని, సక్సెస్ పార్టీని ప్లాన్ చేశారు. ఈరోజు రాత్రి హయత్ హోటల్ లో జరగనున్న ఈ పార్టీకి మూవీ టీం అందరితో పాటు, ఎన్టీఆర్ కూడా హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక సినీ పరిశ్రమ నుంచి దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ సహా పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు హాజరు కానున్నారని సమాచారం.
Also Read