సమంత కి సపోర్ట్ గా నాగ చైతన్య..కొండ సురేఖ ఉక్కిరి బిక్కిరి
on Oct 3, 2024
.webp)
తమ రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ(konda surekha)అక్కినేని కుటుంబం మీద నోటికొచ్చినట్టు మాట్లాడటంపై ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేమికులు కూడా తమ నిరస నని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)తన ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ మాటలని తీవ్రంగా తప్పు బట్టడమే కాకుండా పలు కీలక వ్యాఖ్యలు చేసాడు.కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసింది.కేవలం తన రాజకీయ స్వార్థం కోసం మా పై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.ఆమె ప్రతి మాట వాస్తవానికి దూరంగా ఉండటంతో పాటు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ఏ మాత్రం సహించలేం.మహిళగా ఉండి తోటి మహిళకు అండగా నిలబడాల్సింది పోయి వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ మీడియాలో హైలెట్ కావాలని భావించడం నిజంగా సిగ్గుచేటు అంటూ మండిపడ్డాడు.

అదే విధంగా తన విడాకుల గురించి గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికీ, కుటుంబంతో పాటు మాజీ భార్య మీద ఉన్న గౌరవం కారణంగా సైలెంట్ గా ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు. చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



