అక్కినేని కుటుంబంపై చిరంజీవి ట్వీట్..కొండా మురళితో భేటీ అవుతాడా!
on Oct 3, 2024

అక్కినేని(akkineni)కుటుంబానికి,చిరంజీవి(chiranjeevi)కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరకి తెలిసిందే.మహా నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు(akkineni nageswararao)మొదలుకొని నేటి అఖిల్ దాకా కూడా ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది.ఈ విషయాన్నీచాలా సందర్భాల్లో ఇరు వైపుల కుటుంబ సభ్యులు బహిరంగంగానే చెప్పారు. నాగార్జున(nagarjuna) కూడా చిరంజీవిని అన్నయ్య అని సంబోదిస్తాడు.
రీసెంట్ గా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)బిఆర్ఎస్ ఎంఎల్ఏ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య(naga chaitanya)సమంత(samantha)లని ఉద్దేశించి లేని పోనీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వాటిని ఖండిస్తూ చిరంజీవి ట్వీట్ చేసాడు.గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను.సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు. మా సభ్యులపై చేసిన ఇలాంటి దుర్మార్గపు మాటలని అందరం కలిసి వ్యతిరేకిస్తాం.సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాం.కానీ ఇలాంటి ప్రసంగాలు చేసి ఆ విషయాన్నీ కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి.ఈ హానికరమైన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పాడు.

చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా నిలవడమే కాకుండా సురేఖ భర్త ప్రముఖ రాజకీయనాయకుడు కొండ మురళి(konda murali)చిరు తో ఈ విషయంపై మాట్లాతాడా అనే చర్చ మొదలయ్యింది.ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా నిలుస్తూ కొండ సురేఖ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది.ఈ నేపథ్యంలోనే చిరంజీవి తో కొండ మురళి భేటీ అవ్వచ్చనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.చిరు గతంలో కాంగ్రెస్ నాయకుడుగా చేసిన విషయాన్నీ కూడా గుర్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



