నన్ను నేను అసహ్యించుకొనేదాన్ని!
on Jan 30, 2022

నటి అవికా గోర్ టీవీ డ్రామా 'చిన్నారి పెళ్లికూతురు' (హిందీ 'బాలికా వధు')లో తన అద్భుతమైన నటనతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కెమెరా ముందు పెరుగుతూ వచ్చిన ఆమె, ఒకానొక సమయంలో తన శరీరాన్ని అసహ్యించుకున్నానని చెప్పింది. నెగెటివ్ ఇమేజ్ తన శరీరాన్ని మరింత నిర్లక్ష్యం చేసేలా చేసిందని, అయితే అదే సమయంలో తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నటనపై దృష్టి సారించాననీ అవికా చెప్పింది.
“నన్ను నేను చాలా అసహ్యించుకునేదాన్ని, దాంతో నన్ను నేను అసలు పట్టించుకోలేదు. నేను ఎలా కనిపిస్తానోనని బాధపడలేదు. నేను కేవలం నా నటనపైనే దృష్టి పెట్టాను. మిగతావేవీ పట్టించుకోలేదు. నన్ను నేను అద్దంలో చూసుకోవాలని కూడా అనుకోలేదు. నన్ను నేను చాలా అసహ్యించుకున్నాను. కాబట్టి, ఇది నాలో చాలా ప్రతికూల భావన కలిగించింది. మరుసటి రోజు నా షూట్ కోసం వేసుకొనే కాస్ట్యూమ్స్ కోసం ప్రయత్నించడం నాకు గుర్తుంది, ఇలాంటివే అప్పుడు అనిపించేవి” అని అవికా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
Also read: దేవికకు సాయం చేయండంటూ ట్వీట్.. రాజమౌళిపై ట్రోల్స్!
“నేనెప్పుడూ అలాంటి విషయాల గురించి బాధపడలేదు. నేను బాగా కనిపించాలని అనుకోలేదు. నేను బాగా కనిపించాలనే ఫీలింగ్ కూడా నాకెప్పుడూ అనిపించేది కాదు. నేను నా ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు, వాళ్లెప్పుడూ నా నటన గురించే మాట్లాడేవారు. నేను బాగా నటిస్తున్నాననే అనుభూతిని వారు నాకు కలిగించేవారు. అందువల్ల మిగతా విషయాలపై నేను దృష్టి పెట్టేదాన్ని కాదు" అని కూడా చెప్పుకొచ్చింది అవిక.
Also read: దాసరి డైరెక్షన్‌లో టీనేజ్‌లో రమేశ్ లీడ్ రోల్ చేసిన 'నీడ'
'చిన్నారి పెళ్లికూతురు' తెచ్చిన పాపులారిటీతో తెలుగులో 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తొలి చిత్రంతోటే ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిందామె. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3 లాంటి సినిమాలు చేసిన ఆమె, మిళింద్ చద్వానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



