ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ రొమాన్స్.. మామూలుగా ఉండదు!
on Jul 31, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో నిర్మాత నాగవంశీకి మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' (Devara) సినిమాకి తాను నిర్మాత కానప్పటికీ.. ఆ మూవీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు వంశీ. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
'దేవర' ఫస్ట్ సింగిల్ విడుదల కావడానికి ముందు ఆ సాంగ్ అదిరిపోతుందంటూ నాగవంశీ ట్వీట్ చేశాడు. ఆయన చెప్పినట్టుగానే ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇక 'దేవర' నుండి సెకండ్ సింగిల్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నాగవంశీ అదిరిపోయే ట్వీట్ చేశాడు. "అరవింద సమేత"లోని పోస్టర్స్ ని షేర్ చేసిన వంశీ.. "ఎన్టీఆర్ అన్నని ఇలా క్యూట్ గా చూసి 6 ఇయర్స్ అయింది కదా. మళ్ళీ అలా క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈసారి. మనకి అదే సరిపోతుంది కదా" అని రాసుకొచ్చాడు. వంశీ ట్వీట్ చూసి.. దేవర సెకండ్ సింగిల్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు ఇంకా పెంచేసుకుంటున్నారు.
Also Read