విడాకులు కావాలంటున్న నటుడి భార్య
on May 19, 2020

ప్రజెంట్ జనరేషన్ టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్స్ లో నవాజుద్దీన్ సిద్ధిఖి పేరు తప్పకుండా వినబడుతుంది. గత పదేళ్లలో పలు చిత్రాలలో తన నటనతో అతడు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెరపై గొప్ప నటుడిగా పేరు తెచ్చుకుని, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నవాజుద్దీన్ వ్యక్తిగత జీవితం మాత్రం గొప్పగా లేదు. విడాకులు కోరుతూ అతడి భార్య న్యాయ వ్యవస్థను ఆశ్రయించింది.
పదేళ్ల క్రితమే నవాజుద్దీన్ సిద్ధిఖి, అంజనా కిషోర్ పాండే పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తర్వాత తన పేరును అలియా సిద్ధిఖిగా అంజనా మార్చుకున్నారు. నవాజుద్దీన్ నుంచి ఇప్పుడు ఆమె విడాకులు కోరుతున్నారు. పెళ్లయిన తర్వాత నుండి సమస్యలు మొదలయ్యాయని, వాటిని ప్రజల ముందుకు తీసుకు రావడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. నవాజుద్దీన్ సోదరుడు షమాస్ కూడా విడాకులకు ఓ కారణమని ఆరోపించారు. విడాకులు తీసుకుంటున్న కారణంగా అలియా సిద్ధికి పేరును తన ఉపయోగించాలి అనుకోవడం లేదని, అంతకుముందున్న ఒరిజినల్ నేమ్ అంజనా కిషోర్ పాండేగా కొనసాగుతానని ఆమె తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ఆఫీసులు పనిచేయడం లేదు. అందువల్ల ఈ మెయిల్ వాట్సాప్ ద్వారా విడాకుల నోటీసు నవాజుద్దీన్ సిద్ధిఖికి పంపించారట. అతడి నుండి ఏ విధమైన స్పందన రాలేదని అంజనా కిషోర్ పాండే లాయర్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



