బిగ్ బాస్ కౌశల్‌కి సామ్రాట్ రిక్వెస్ట్.. తేజశ్విని కోసమేనా?
on Oct 5, 2018
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ముగిసింది. విజేతగా కౌశల్ నిలిచాడు. ఓ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఇంత క్రేజ్ సంపాదించుకోవొచ్చా అని అందరూ ఆశ్చర్యపడేలా కౌశల్ క్రేజ్ సంపాదించాడు. అతని పేరుతో ఆర్మీ క్రియేట్ చేసి ఫుల్ హడావిడి చేసారు. అయితే ఈ హడావిడి అంతా షో అయిపోయేవరకే ఉంటుంది. తరువాత ఆర్మీ సైలెంట్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా షో అయిపోయాక కూడా ఆ క్రేజ్ నడుస్తూనే ఉంది. రీసెంట్ గా కౌశల్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే.. అక్కడ ఒక హీరోని చూడడానికి ఎగబడినట్టు జనాలు ఎగబడ్డారు. దీని బట్టే అర్ధమవుతుంది షో అయ్యాక కూడా క్రేజ్ తగ్గలేదని. సోషల్ మీడియాలో కూడా కౌశల్ ఆర్మీ అంటూ కౌశల్ గురించి పోస్ట్ లు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే కొందరు మాత్రం అభిమానం పేరుతో హద్దు దాటుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కౌశల్ కి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తేజశ్వినిని టార్గెట్ చేస్తూ ఫన్నీ మెమిస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సామ్రాట్ నీ అభిమానులను కాస్త కంట్రోల్ చేయి అంటూ కౌశల్ ని రిక్వెస్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసాడు.
'కౌశల్ అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా నువ్వు కష్టపడుతున్నావు. నేను కూడా 11 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ‘నీ కోరిక ప్రకారం సక్సెస్ అంతా నీ దగ్గరకు వస్తుంది’ అని నీకొక విష్ కూడా రాయడం జరిగింది. నీకు అంత అభిమానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్లీజ్ మరోకోణం కూడా చూడు. అభిమానం పేరుతో మనతో బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిల్ని ట్రోల్ చేయడం జరుగుతోంది. అది కూడా గేమ్ అనుకుందాం. కానీ గేమ్ అయిపోయింది. ఇంత అభిమానంతో నీకు రెస్పాన్సిబులిటీ కూడా పెరిగింది. ఆ రెస్పాన్సిబులిటీతోనే ఆ ట్రోల్స్‌ని ఆపు’ అంటూ సామ్రాట్ రిక్వెస్ట్ చేశాడు. మరి దీనిపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.