My Perfect Husband web series review: మై పర్ ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ రివ్యూ!
on Aug 16, 2024
వెబ్ సిరీస్ : మై పర్ ఫెక్ట్ హస్బెండ్
నటీనటులు: సత్యరాజ్, సీతా, లివింగ్ స్టన్, రేఖ, రక్షన్, వర్ష బొల్లమ్మ తదితరులు
ఎడిటింగ్: పార్థసారథి
సినిమాటోగ్రఫీ: అర్థర్ విల్సన్
మ్యూజిక్: విద్యాసాగర్
నిర్మాతలు: మహమ్మద్ రషిత్
దర్శకత్వం: తమిర
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
బహుబలి ' కట్టప్ప ' గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన సత్యరాజ్ నటించిన వెబ్ సిరీస్ మై పర్ ఫెక్ట్ హస్బెండ్ (Myperfecthusband). తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం.
కథ :
ఓ ప్రైవేట్ కాలేజీలో భారతీ సర్ గా చదువు చెప్తుంటాడు సత్యరాజ్. అతని భార్య సారస్, ఇంకా ముగ్గురు పిల్లలతో అన్యోన్యమైన లైఫ్ ని సాగిస్తుంటాడు. ఇక తన కొడుకు వసీగరన్ ఓ పెళ్ళి సంబంధం వస్తుంది. ఆ పెళ్ళి చూపులకి వచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మకి, భారతీకి మధ్య గతంలో ఏదో రిలేషన్ ఉందని సారస్ కి అనుమానం వస్తుంది. ఎందుకంటే భారతీ ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే తన భర్త లైఫ్ లో తనొక్కతే అనుకున్న సారస్ కి భారతీ లైఫ్ లో మరో అమ్మాయి ఉందని తెలుసుకొని షాక్ అవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? భారతీ, సారస్ ల మధ్య ఏర్పడిన అపార్థాలు తొలగిపోయాయా ? ఇంతకీ ఆ పెళ్ళి జరిగిందా లేదా అనేది మిగతా కథా.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్నాయి. మొదటగా భారతీ(సత్యరాజ్) సర్ లైఫ్ లో తన ఫ్యామిలీతో ఎంత అన్యోన్యంగా ఉంటాడో చూపిస్తాడు. ఇక తన కొడుకుకి వచ్చిన పెళ్ళి సంబంధంతో అతని లైఫ్ టర్న్ తిరుగుతుంది. ఇక్కడ నుండి కథ ఆసక్తిగా సాగుతుంది. మొదటి ఎపిసోడ్ - ది ఫ్రొఫెసర్ పాస్ట్.. ఇందులో భారతీ ప్రెజెంట్ హ్యాఫీ మూమెంట్స్, ఇంకా గతంలో తన లైఫ్ స్టోరీని చూపిస్తారు.
ఇక ప్రతీ ఎపిసోడ్ కి ఓ ట్విస్ట్ లాగా చూపించాడు దర్శకుడు తమిర. తక్కువ పాత్రల చుట్టూనే ఓ ఫ్యామిలీ కథని తీసుకొచ్చారు. పెళ్లికి ముందు ప్రతీ ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా అది ఉంటుందా? లేక ప్రేమ జ్ఞాపకాలని కూడా మోస్తుందా అనే చిన్న పాయింట్ తో ఎనిమిది ఎపిసోడ్‌లుగా మేకర్స్ తీసారు. అయితే దీనికి ఓ నాలుగు ఎపిసోడ్ లలో ముగించేయొచ్చు. పాత తరం ప్రేమకథలని సృష్టించిన దర్శకుడు.. ఈ తరం ప్రేమ కథని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ వే లో ముగించేశాడు. అసలు యూత్ ఇష్టపడే పాయింట్ ని వదిలేసి, యూత్ కి ఓ మెసెజ్ లా ఇద్దామని తీసినట్టుగా అనిపిస్తుంది.
ఈ సిరీస్ అంతా రెండు కుటుంబాల చుట్టూనే తిరుగుతుంటుంది. అయితే ఒక్కో ఎపిసోడ్ లో కొత్తదనం మిస్ అయింది. వినోదం కరువైంది. కానీ మెసెజ్ బాగుంది. అయితే దీనికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. పెద్దల మనసులని పిల్లలు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం లాంటివి ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం.. దర్శకుడు అదే కథని తీసుకున్నాడు. దాంతో పాటు ఎనిమిది ఎపిసోడ్‌లు.. అందులోను కొన్ని మనం రిపీటెడ్ గా చూస్తున్నామా అనిపిస్తుంది. అశ్లీల పదాలు వాడలేదు. బోల్డ్ సీన్లు లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా కథ సాగుతుంది. అయితే చివరి వరకు ఓపికతో ఎవరు చూస్తారనేది తెలియదు. పార్థసారథి ఎడిటింగ్ ఒకే. అర్థర్ సినిమాటోగ్రఫీ బాగుంది. విద్యాసాగర్ బిజిఎమ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
భారతీ సర్ పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయాడు. ఈ వెబ్ సిరీస్ లో అతనే ప్రధాన బలంగా నిలిచాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్