రోజా, ఆత్యా పాత్య.. అరెస్ట్ తప్పదా!
on Aug 16, 2024
సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నటి రోజా(roja)ఎంఎల్ఏ గా, మంత్రి గా గత వైసిపీ ప్రభుత్వంలో బాధ్యతలుకూడా చేపట్టింది. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చిత్తుగా ఒడి ప్రస్తుతం రకరకాల ప్రాంతాల్లో తిరుగుతు ఉంది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రోజా గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంని నిర్వహించింది.వాటి నిర్వహణకి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఈ విషయమే రోజా మెడకు చుట్టుకుంది. శాంక్షన్ అయిన
125 కోట్ల రూపాయల్లో 105 కోట్లు దుర్వినియాగం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఆత్యా పాత్య సిఈ ఓ ప్రసాద్ సిఐడి కి ఫిర్యాదు చేసాడు. దీంతో సిఐడి విచారణకి ఆదేశించింది. విజయవాడ సిపీ కి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
దీంతో ఇప్పుడు రోజా అరెస్ట్ ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా కోట్ల ఆస్తులని సంపాదించిందనే ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వంలో చట్ట ప్రకారమే చర్యలు ఉండబోతున్నాయని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. రోజా గతంలో చంద్ర బాబు నాయుడు(chandrababu naidu) పవన్(pawan kalyan)ని నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన అభిమానులని కూడా దూరం చేసుకున్న విషయం అందరకి తెలిసిన విషయమే.
Also Read