ENGLISH | TELUGU  

సుమ 'జయమ్మ పంచాయితీ'.. 'తిప్పగలనా' సాంగ్ వచ్చేసింది!

on Nov 23, 2021

సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'తిప్పగలనా' అనే సాంగ్ విడుదలైంది.

'జయమ్మ పంచాయితీ'కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా సాంగ్స్ పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ మొదటి సాంగ్ 'తిప్పగలనా' లిరికల్ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. గుడిలో పూజారిగా పనిచేసే యువకుడు తన ప్రేయసి కోసం పాడుకునే ఈ పాట ఆకట్టుకుంటోంది. రామాంజనేయులు లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ని రోహిత్ ఆలపించారు. ఇక లిరికల్ వీడియోలో జయమ్మగా సుమ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. 'జయమ్మ పంచాయితీ'తో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆమె ఈ సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.