రజనీకాంత్ ఇప్పుడు మోహన్ లాల్ సొంతం!
on Jul 2, 2016

రజనీకాంత్ "కబాలి" చిత్రం ఫస్ట్ లుక్ మొదలుకొని మొన్న విడుదలైన ఆడియో వరకూ అన్నీ ఏదో ఒక విధంగా సంచలనాలను సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా మలయాళ డబ్బింగ్ రైట్స్ ను అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్ సొంతం చేసుకొన్నారు. భారీ మొత్తం చెల్లించి ఈ రైట్స్ ను ఆయన దక్కించుకొన్నట్లు సమాచారం. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే కథానాయికగా నటిస్తుండగా.. ధన్సిక ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ఇకపోతే.. "కబాలి" జూలై 22న కూడా విడుదలయ్యే అవకాశాల్లేవని తమిళనాట టాక్. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదని, డి.ఐ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందని అందుకే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 1న విడుదల చేద్దామనే ఆలోచనలో దర్శకనిర్మాతలున్నారని సమాచారం. భారీ అంచనాలు ఉన్న సినిమా ఇలా ఇన్ని సార్లు వాయిదాపడడం సినిమా రిజల్ట్ మీద మాత్రమే కాక కోట్లు ఖర్చు పెట్టి సినిమాను కొనుక్కొన్నా డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్ మీద ప్రభావం చూపుతుందని తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను ఆలోచిస్తే బాగుండు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



