శిరీష్ సినిమాలో తెలుగమ్మాయి!
on Jul 2, 2016

ప్రస్తుతం "సైమా" అవార్డ్ వేడుకల కోసం సింగపూర్ వెళ్ళి అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న అల్లు శిరీష్.. అక్కడ్నుంచి తిరిగి రాగానే ఎం.వి.కె.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం రెగ్యులర్ షూట్ లో పాల్గొంటాడు. ఇప్పటికే ఈ సినిమాలో "కృష్ణగాడి వీరప్రేమగాధ" ఫేమ్ మెహరీన్ ను మెయిస్ హీరోయిన్ గా సెలక్ట్ చేయగా.. సెకండ్ హీరోయిన్ గా తెలుగమ్మాయి నందిని రాయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకూ మోడల్ అయిన నందిని రాయ్ సుధీర్ బాబు హీరోగా "మోసగాళ్లకు మోసగాడు" చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా అనుకొన్న స్థాయిలో ఆడకపోవడంతో తమిళనాడుకు పయనమైంది అమ్మడు. అక్కడ చిన్నాపెద్ద సినిమాలు చేస్తూనే ఇక్కడ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న నందినికి ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎంట్రీ దొరకడంతో.. ఇక అమ్మడికి టాలీవుడ్ లో పర్మనెంట్ సీట్ దొరికేసినట్లే.
ఇకపోతే.. అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం "శ్రీరస్తు శుభమస్తు" పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూలైలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ సన్నద్ధమవుతున్నారు. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



