గాయకుల మనసు పరవశించిన తరుణం!
on Jul 2, 2016

ఈ ప్రపంచంలోని ఏ జీవికైనా సంతాన ప్రాప్తికి మించిన సంతోషం ఏదీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ సంతోషానుభూతులను ఆస్వాదిస్తున్నారు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్ర మరియు సింగర్ శ్రావణ భార్గవి దంపతులు. వారికి నేడు ఓ పండంటి ఆడబిడ్డ పుట్టింది. సంగీతం పరవళ్ళు తోక్కే వారింట్లో.. సరస్వతీ దేవే పుట్టిందేమో అన్నంత సంతోషంగా ఈ ప్రేమ జంట.. తమ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. సింగర్లుగా ఓ పక్క సినిమాల్లో పాటలు పాడుతూనే.. మరోపక్క ప్రయివేట్ ఈవెంట్లకు హాజరవుతూ గత కొన్నేళ్ళుగా యమా బిజీగా కాలం గడుపుతున్న ఈ ఇద్దరూ ఇకపై తమ ప్రియ పుత్రికతో ఆడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



