మీసం మేలేసిన రాయుడు..
on Mar 3, 2017

డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఆడియో వేడుక లేదని ముందే ప్రకటించారు. దానికి బదులుగా సినిమాలోని ఆరు పాటలను రోజుకోక్కొటి చొప్పున ఆరు రోజుల పాటు రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. దీనిలో భాగంగా ఇవాళ " మిర మిర మీసం " సాంగ్‌ను రిలీజైంది.
"నాయకుడై నడిపిస్తాడు" అంటూ సాగే ఈ సాంగ్ పవన్ ఫుల్ టైం పాలిటిక్స్‌లోకి వస్తున్న నేపథ్యంలోనే ఈ పవర్‌ఫుల్ సాంగ్‌ని పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని అనిపిస్తుంది. ఈ పాటను జనసేన కార్యకర్తలు బాగా యూజ్ చేసుకుంటారనడంలో సందేహం లేదు. ఈ పాటను 4 వందల మంది డాన్సర్లతో గ్రాండ్‌గా చిత్రీకరించారట. గోపాలా గోపాలాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ పవన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరర్ మరార్ నిర్మిస్తుండగా..డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మార్చి 24న రిలీజ్ చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



