తెలుగు సినీ పరిశ్రమ 'మేము సైతం' ప్రారంభ౦
on Nov 30, 2014
'హుద్ హుద్' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన `మేము సైతం' గీతాన్ని గాయని, గాయకులూ ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, దర్శకరత్న దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు తదితర ప్రముఖలు హాజరయ్యారు. వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని మ్యుమంత్రి సహాయనిధికి అందించాలనే లక్ష్యంతో తెలుగు చలన చిత్రసీమ 12గంటల పాటు వివిధ కార్యక్రమాల ద్వార ఏకధాటిగా వినోదం పంచబోతున్నారు.