సినీ పరిశ్రమలో విభేదాలు లేవు: దాసరి
on Nov 30, 2014
ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్ తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై స్పందించి ‘మేముసైతం’ అంటూ సినీ పరిశ్రమ తరఫున బాధితులను ఆదుకునేందుకు మునుపెన్పడూ లేనంత భారీస్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో విభేదాలున్నాయనీ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. వెండితెర వున్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమ ఒక్కటిగానే వుంటుందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించేవారనీ, వారి తర్వాత ఇప్పటి తరం కూడా అదే దారిలో నడుస్తోందని దాసరి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎప్పుడెలాంటి కష్టం వచ్చినా చిత్ర పరిశ్రమ స్పందిస్తుందనడానికి ‘మేముసైతం’ ఓ నిదర్శనమని అన్నారు.