మెహరీన్ కి ఆ జబ్బు ఉంది!
on May 11, 2020
జబ్బు అంటే పెద్దగా భయపడాల్సిన జబ్బేమీ కాదు. ఆరోగ్యానికి ప్రమాదమూ లేదు. ఇంకా చెప్పాలంటే... కరోనా కాలంలో ఆ జబ్బు ఉండడం ఆరోగ్యం. మెహరీన్ కి ఉన్న జబ్బు ఓసిడి. దీని లక్షణాలు అద శుభ్రత. ప్రేక్షకులకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే... 'మహానుభావుడు' సినిమా చూశారు కదా! అందులో హీరో శర్వానంద్ క్యారెక్టర్ గుర్తుందా? సేమ్ టు సేమ్ ఓసిడి లక్షణాలు ఉన్న మనుషులు అదే విధంగా ప్రవర్తిస్తారు. ఆ సినిమాలో కథానాయిక మెహరీనే.
'మహానుభావుడు' సినిమా షూటింగ్ చేసేటప్పుడు దర్శకుడు మారుతి హీరో శర్వానంద్ తనతో 'యు ఆర్ రియల్ మహానుభావుడు' అని తరచూ అనేవారని మెహరీన్ తెలిపారు. అందువల్ల ఇప్పుడు తరచుగా చేతులు కడుక్కోవడం శుభ్రత పాటించడం తనకు పెద్ద కష్టమేమీ కావడం లేదని ఆమె అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. తన ఫ్రెండ్ ఫిలాసఫర్ అన్ని అమ్మే అని చెప్పిన మెహరీన్... తన తల్లిని దేవత తో పోల్చారు. తనకి, తల్లికి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండవని, తన ఫోన్ పాస్వర్డ్ కూడా తల్లికి తెలుసునని ఆమె అన్నారు.