దిల్ రాజు భార్య ఎవరంటే?
on May 11, 2020
ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. పెళ్లికి హాజరైన వారి సంఖ్య 20కి మించలేదట. నిజామాబాద్ లో, సొంత ఫామ్ హౌస్ లో, తమ ఫ్యామిలీ కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఆ గుడిలోకి వేరొకరు వెళ్లడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఆదివారం ఉదయం నుండి ఫామ్ హౌస్ చుట్టుపక్కల పూర్తి బందోబస్తు పెట్టారు. దిల్ రాజు ఫ్యామిలీ అంగీకారంతో జరిగిందట. ఇది ఆయనకు రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య కొన్నాళ్ల క్రితం చనిపోయారు. ఆవిడ ఒక కుమార్తె హర్షిత రెడ్డి ఉన్నారు. ఆమెకు పెళ్లి అయింది. ఒక పిల్లాడు కూడా! ఇప్పుడు ఆ కుమార్తె దగ్గరుండి పెళ్లి చేశారట.
గతంలో దిల్ రాజు పెళ్లి ప్రస్తావనకు వచ్చినప్పుడు... పలువురు కథానాయికల పేర్లు వినిపించేవి. మరీ ముఖ్యంగా పరుగు కథానాయక షీలాతో ఆయనకు పెళ్లి అయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు పెళ్లి చేసుకున్నది కథానాయికను కాదు. బంధువుల అమ్మాయి అని తెలిసింది. ఆవిడ ఇష్టంగా పెళ్లి చేసుకున్నారట. ఈరోజు పెళ్లి ఫోటోలు అధికారికంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్షణాలలో అవి రావచ్చు.