ఇలియానా అవి మిస్ అవుతుందట!
on May 20, 2020
ఎప్పుడెప్పుడూ షూటింగులు మొదలు పెడదామా? అని చాలామంది హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు చాలామంది చెబుతున్నారు. షూటింగ్ లైఫ్ మిస్ అవుతున్నామని చెబుతున్నాడు. గోవా నడుము సుందరి ఇలియానా మాత్రం బీచ్ లైఫ్ మిస్ అవుతున్నాని చెబుతోంది. ఇలియానా పుట్టి పెరిగింది గోవాలో. అది కూడా సముద్ర తీరం పక్కన ఉన్న ఇంటిలో. అందుకని, ఇంటి నుండి బయటకు రావొద్దని చెప్పడంతో బీచ్ లైఫ్ మిస్ అవుతున్నాని చెబుతోంది.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఇలియానా ఇంటర్నెట్ వేదికగా సోషల్ మీడియా సైట్లలో అందాల విందు అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జిమ్ చేసి వచ్చిన తర్వాత ఫేస్ కాకుండా బాడీ పార్ట్స్ కనిపించేలా ఫోటోలు తీస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీలలో పెడుతోంది. వీటికి గతంలో దిగిన బికినీ ఫోటోలు అదనం. తన అందం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
