మెగాహీరో కథతో గోపిచంద్!
on Jul 3, 2016

రామ్ చరణ్ తో 'రచ్చ' అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించాడు సంపత్ నంది. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను బాగానే ఖుషి చేసింది. 'రచ్చ' తర్వాత చరణ్ తో మరో సినిమా చేస్తున్నానని గతంలో ఈ దర్శకుడు అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి ‘ఛోటా మేస్త్రీ’ అనే టైటిల్ కూడా పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ కథ మరో హీరోకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ కథను చరణ్ తో తీయాలని వెయిట్ చేసిన సంపత్ నందికి కనుచూపు మేరల్లో చరణ్ డేట్స్ కనిపించలేదు. దీంతో చేసేదేమి లేక ఇదే కథతో హీరో గోపిచంద్ ను ఆశ్రయించడం, ఇందుకు గోపి ఒకే చెప్పడం జరిగిపోయాయి. చరణ్ అంగీకారంతోనే ఈ సినిమా గోపిచంద్ కు వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానుంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీ హీరోలు సంపత్ ను ఎదురు చూసేలా చేయడం. చివరికి ఆయనకు హ్యాండ్ ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. గోపిచంద్ తో సంపత్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



