మాట మారుస్తున్న మారుతి!
on Jul 3, 2016
'ఈరోజుల్లో' సినిమాతో వెలుగులోకి వచ్చిన మారుతి 'భలే భలే మగాడివోయ్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దీంతో తన దగ్గర ఉన్న కథలతో చిన్న సినిమాలు చేసే అవకాశాన్ని తన దగ్గర పని చేసే వాళ్ళకి ఇస్తున్నాడు. సినిమా హిట్ అయితే దానికి 'కర్త కర్మ క్రియ అంతా నేనే' అంటారు. ప్రేమ కథా చిత్రానికి ఇదే జరిగింది. ఆ సినిమా దర్శకుడు జె ప్రభాకర్ రెడ్డి. పాపం.. ఆయన పేరే వినిపించలేదు. సినిమా తేడా కొడితే మాత్రం ఆయన వెర్షన్ డిఫరెంట్ వుంటుంది. రొమాన్స్ , లవ్ యూ బంగారం , గ్రీన్ సిగ్నల్ లాంటి సినిమాలకు ఇదే జరిగింది. జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే ఇచ్చానని తప్పించుకున్నారాయన. రీసెంట్ గా రిలీజ్ అయిన 'రోజులు మారాయి' చిత్రానికి మారుతి కథ అందించాడు. అయితే ఈ సినిమా బాలేదని అటు విమర్శకులు.. ఇటు ప్రేక్షకులు తేల్చేశారు. దీంతో సినిమా ఔట్ ఫుట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే తనది, ఒక్కరోజు కూడా సెట్ కి వెళ్ళలేదంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. సినిమా రిలీజ్ కు ముందేమో అచ్చం నేను డైరెక్ట్ చేసినట్లుగానే సినిమా ఉందని చెప్పిన మారుతి ఇప్పుడు ఇలా తప్పించుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



