వైవాహిక జీవితానికి మీరా జాస్మిన్ గుడ్‌బై..?
on Dec 14, 2016

దర్శకుడు విజయ్‌తో సంసార జీవితానికి స్వస్తి పలికి అమలాపాల్ సౌత్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె బాటలో మరో మళయాళీ భామ విడాకులకు రెడీ అయ్యింది. "గుడుంబా శంకర్", "భద్ర" సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉండగానే..మాండలిన్ రాజేశ్ అనే మ్యూజిషియన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది..కానీ ఆ మాట మీద నిలబడకుండా 2014లో దుబాయ్‌కి చెందిన అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది మీరా. ఈ పెళ్లి అత్యంత వివాదాస్పదమైంది.
అనిల్ జాన్‌కు అప్పటికే పెళ్లయి ఉండటం.. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మీరాతో రెండో పెళ్లికి సిద్ధమవ్వడంతో మొదటి భార్య బంధువులు దాడి చేయబోతే..పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఈ జంట. ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ మీరా..అనిల్‌లు..రెండేళ్లు తిరిగేసరికి విడిపోవాలనుకోవడం దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లయిన ఏడాదికే వీళ్లిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట. ఏడాది నుంచి విభేదాలతోనే కలిసి మెలిసి సాగుతున్న ఈ జంట..ఇక వివాహ జీవితానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విడాకులు కావాలని భర్తకు మీరా నోటీసులు పంపినట్లు సమాచారం..ఇకపై భారత్‌లోనే ఉండి తిరిగి నటనపై దృష్టి పెట్టాలని జాస్మిన్ అనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



