చరణ్‌కి ఇంత పబ్లిసిటీ పిచ్చేంటండీ బాబూ..!
on Dec 14, 2016
.jpg)
మెగా హీరోల్లో ఎవ్వరూ పెద్దగా పబ్లిసిటీపై ఫోకస్ చేయరు. ఒక్క రామ్ చరణ్ తప్ప! ఇది వరకు మీడియాకు దూరంగా ఉన్న చరణ్ ఇప్పుడు మాత్రం మీడియాపై బాగానే ఫోకస్ పెట్టాడన్న విషయం అర్థమవుతోంది. ధృవ పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకొన్నాడు చరణ్. తొలిసారి అమెరికాలో ప్రీమియర్ షోలకూ అటెండ్ అయ్యాడు. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాన్ని కూడా ఇన్నోవేటివ్‌గా డిజైన్ చేయడానికి తహతహలాడాడు. తనకంటూ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్ గా చేసి... మీడియాని ఆకర్షించాడు. ఆ కార్యక్రమానికి కేటీఆర్‌ని పిలిచి.... తన ఫాలోయింగ్‌ని వీర లెవిల్లో చూపించుకోవడానికి ట్రై చేశాడు.
ఇప్పుడూ అంతే. ప్రీమియర్ షోల హంగామా తరవాత అమెరికా నుంచి దిగొచ్చాడు చరణ్. చరణ్ వచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్ ముందు అభిమానులు గుమ్ముగూడిపోయారు. బొకేలతో ఆహ్వానించారు. అదేదో.. దేశ శాంతి సౌభాగ్యాల కోసం పక్క దేశాలతో పోరాడి వచ్చిన వీరుడిలా ట్రీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో చూపించుకోవడానికి చరణ్ వీర లెవిల్లో ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్థమవుతోంది. రాక రాక ధృవతో ఓ హిట్టొచ్చింది. పబ్లిసిటీతో ఈ సినిమా వసూళ్లని పెంచుకోవడానికి చరణ్ మళ్లీ ప్రమోషన్లను ఉధృతం చేయడం ఖాయం. ఎంత చేసినా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడం కష్టమని ట్రేడ్ వర్గాలు అప్పుడే చెప్పేస్తున్నాయి. పాపం.. చరణ్‌కి ఇది బ్యాడ్ న్యూసే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



