రాజమౌళిపై గురి పెట్టిన రకుల్
on Dec 14, 2016

దక్షిణాది మొత్తానికి నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే ఎవ్వరైనా సరే... ఎస్.ఎస్.రాజమౌళి పేరు చెప్పాల్సిందే. ఈ దర్శక ధీరుడు తీసిన ప్రతీ సినిమా హిట్టే. మగధీర, ఈగ, బాహుబలి అయితే కొత్త స్థాండర్డ్స్ సృష్టించాయి. అందుకే అగ్ర హీరోలు రాజమౌళితో జట్టు కట్టాలని తహతహలాడుతుంటారు. కథానాయికలకూ ఆ కోరిక ఎక్కువగానే ఉంటుంది. `రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే ఎంత బాగుంటుందో` అంటూ వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. వీలున్నప్పుడుల్లా రాజమౌళిని కీర్తించేది అందుకే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే బాట పట్టింది.
సందర్భం లేకపోయినా తరచూ రాజమౌళిని కీర్తించి పడేస్తోంది. ఇప్పుడూ అదే చేసింది. ''కొంతమంది దర్శకులు ఆఫర్ ఇస్తానంటే.. కథేంటి అని అడక్కూడదు.. గుడ్డిగా వాళ్లని ఫాలో అయిపోవడమే మంచిది. రాజమౌళి లాంటి దర్శకుడు పిలిచి అవకాశం ఇస్తానంటే.. కథ గురించి అడగడం వెర్రితనమే'' అంటోంది రకుల్. దాన్ని బట్టి రాజమౌళి సినిమాలో నటించాలన్న ఆశ రకుల్‌లో ఎంతుందో ఊహించుకోవొచ్చు. బాహుబలి అయిపోయాక... కొంతకాలం బ్రేక్ తీసుకొంటాడు జక్కన్న. 2017 చివర్లో తదుపరి సినిమా మొదలెట్టే ఛాన్స్ ఉంది. ఈలోగా రాజమౌళిని ఎన్నిసార్లు కీర్తిస్తే రకుల్ కి అంత మంచిది. ఇన్ని పొగడ్తల్లో ఒక్కటైనా జక్కన్న చెవిలో పడకుండా పోతుందా.. ఆయన పిలిచి ఆఫర్ ఇవ్వకపోతాడా? రకుల్ ఎత్తుగడ కూడా అదే అయ్యుంటుంది కదూ..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



