పంచ్ లతో, ముద్దులతో ముంచేసిన మోడ్రన్ `మన్మథుడు-2`
on Jun 13, 2019
కింగ్ నాగార్జున నటించిన `మన్మథుడు` చిత్రానికి సీక్వెల్ గా `మన్మథుడు-2` చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది. ఇక ఈ టీజర్ లో నాగార్జున టైటిల్ కు న్యాయం చేస్తూ ఒక రేంజ్ లిప్ లాక్స్ పెడుతూ రొమాన్స్ తో రెచ్చిపోయాడు. ` నీకు షటర్లు మూసేసి దుకాణం సద్దేసే టైమ్ వచ్చేసింది, ఇంత అందంగా పుట్టి ప్రయోజనం ఉండదుగా అనే డైలాగ్ కానీ, ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ మొలుస్తుందా అని వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ శ్రీ లక్ష్మి చెప్పే డైలాగ్ , పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో బ్యాటింగ్ మొదలు పెట్టావా? అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ .. ఇలా మన్మథుడు పై పంచ్ లు బాగానే పేలాయి. ఇక మన మన్మథుడు స్టిల్ వర్జిన్ అంట. తనే ఒప్పుకున్నాడు కూడా. ఇలా మన్మథుడు 2 డైలాగ్స్ డబుల్ మీనింగ్ లో ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. చివర్లో `ఐడోంట్ ఫాల్ ఇన్ లవ్ ...ఐ మేక్ ఓన్లీ లవ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో నాగ్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. మన్మథుడు చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర గా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. మరి మన్మథుడు 2 టైటిల్ కి జెస్టిఫికేషన్ ఇస్తూ అమ్మాయిలతో ముదురు వయసు మన్మథుడులా మితి మీరిన రొమాన్స్ చేస్తూ ప్రజంట్ వస్తోన్న చిత్రాలకు పోటీ చేసేలా ఉన్నాడు. మొత్తానికి మన్మథుడు 2 టీజర్ తో ఇంట్రస్టింగ్ క్రియేట్ చేసి సినిమా పై భారీ అంచనాలే రేకెత్తించింది అనడంలో సందేహం లేదు.