అఫీషియల్: సాహో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అతడిదే!
on Jun 13, 2019
'సాహో' టీజర్‌తో పాటు ఈ రోజు మరో వార్త బయటకొచ్చింది. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనే విషయంలో సగం స్పష్టత వచ్చింది. సగం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వరకూ జిబ్రాన్ కన్ఫర్మ్. సాంగ్స్ ఎవరి దగ్గర్నుంచి తీసుకుంటారో మరి!? ఆల్రెడీ టీజర్‌లో శ్రద్ధా కపూర్ కనిపించిన ఫస్ట్ షాట్స్ సాంగ్ షూటింగ్‌లోది అని టాక్. 'సాహో' నుంచి తప్పుకున్నామని బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ప్రకటించిన తర్వాత.. జిబ్రాన్ పేరు ఎక్కువ వినిపించింది. మధ్యలో ఎస్.ఎస్. తమన్ పేరూ వినిపించింది. వీరిద్దరిలో 'సాహో' మేకింగ్ వీడియోస్ 'షేడ్స్ ఆఫ్ సాహో-1'కి తమన్, రెండో దానికి జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. చివరకు, దర్శకుడు సుజీత్ తొలి సినిమా 'రన్ రాజా రన్'కి మ్యూజిక్ అందించిన జిబ్రాన్ 'సాహో' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు. ఈ రోజు అఫీషియల్‌గా ట్విట్టర్‌లో ప్రకటించాడు. తానే 'సాహో'కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నాని జిబ్రాన్ ట్వీట్ చేశాడు.