జెండాను అవమానించిన మల్లికా షెరావత్
on May 31, 2014
జెండాను అవమానించిన మల్లికా షెరావత్
దేశానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, అవమానించకుండా వుంటే చాలు అనిపిస్తుంది ఈ విషయం తెలిస్తే... జాతీయ జెండాను నెక్కర్లుగా తొడుక్కునే సంస్కృతి కొన్ని దేశాల్లో మామూలే. కానీ మన దేశంలో జాతీయ జెండాను పవిత్రంగా భావిస్తారు. ఎలా పడితే అలా జెండాను వాడితే దేశం పట్ల గౌరవం వున్న ప్రతి వారు ఇక్కడ స్పందిస్తారు. మరి ఆ స్పృహ ‘డర్టీ పాలిటిక్స్’ సినిమా చేస్తున్న వాళ్లకు తగ్గిందా అని అనిపిస్తోంది. ఇదేదో మారుమూల పల్లెల్లోనో, అజ్ఞానంతో చేసిన పనికాదు. రాజస్థాన్ అసెంబ్లీ ముందు బాలీవుడ్ తార మల్లికా షెరావత్ పై చిత్రించిన సన్నివేశాలు విస్మయానికి గురిచేస్తాయి. మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. అందులో కొన్ని సీన్‌లు రాజస్థాన్ అసెంబ్లీ ముందు షూట్ చేశారు. ఆ సన్నివేశాలలో మల్లికా జాతీయజెండాను ఒంటికి చుట్టుకొని కనిపిస్తుంది. ఒక చేతిలో సిడి పట్టుకుని, ఎర్రలైటు ఉన్న వాహనంపై కూర్చుని, తన మార్కు పోజులు ఇచ్చింది. ఇలా తన బాడీని జెండాతో కప్పుకుని ఉన్న స్టిల్‌ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. మొదటి పోస్టర్‌తోనే ఇంత వి వాదాస్పద చర్చలకు దారి తీసిన ‘డర్టీ పాలిటిక్స్’ చిత్రం ఎలా ఉండబోతుందో..ఈ వివాదం ఇంకా ఎటువంటి చర్చలకు, చర్యలకూ దారి తీస్తుందో.. ఏమయినా ఇలా జాతీయ జెండాను అవమానించడం పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.