మహేష్ సినిమాకు పవన్ ఫ్రీ పబ్లిసిటీ
on May 31, 2014
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన ‘ఆగడు' చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్ ఒకవైపు క్రేజ్ క్రియేట్ చేస్తూనే మరోవైపు సెటైర్లకు ఆస్కారం ఇస్తోంది. ‘ఆగడు' టీజర్‌లో డైలాగ్స్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్'ని గుర్తుచేస్తున్నాయని టాక్ మొదలైంది.
ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ అనే పేరుతో, మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గబ్బర్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్ కూడా పోలీసు పాత్రలోనే కనిపించారు. అందులో పోలీస్ బెల్టు పై గబ్బర్‌సింగ్ అని సినిమా టైటిల్ కనిపించినట్లుగానే, ఆగడులో కూడా మహేష్ బెల్టు పై చిత్రం పేరు కనిపించింది. పోలీసు పాత్రలో టక్ వేసుకోకుండా పవన్ గబ్బర్ సింగ్‌లో కనిపించాడు. టీజర్‌లోనూ మహేష్ ఒక చోట అలాగే కనిపిస్తాడు.
ఇక డైలాగుల విషయానికి వస్తే, సింహం గడ్డం గీసుకోదు అనే పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్‌కి మహేష్ ఇందులో కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ‘ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్' అనే డైలాగ్ ‘ఆగడు' టీజర్‌లో పవర్‌ఫుల్‌గా వినిపిస్తోంది. పవన్ పై సెటైర్‌తో టీజర్ రిలీజ్ చెయ్యటంలో ఉద్దేశ్యం ఏమయి ఉంటుందనే విషయం అర్థం కాకపోయినా, ఆల్‌రెడీ ఈ టాపిక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి ఎన్నికల విజయం తర్వాత పవన్ పేరు చెబితేనే ఎక్కడలేని పాపులారిటీ వచ్చి పడుతోంది. కానీ ఇండియన్ మోస్ట్ డిజైర్డ్ మ్యాన్ మహేష్‌కు పవన్ పాపులారిటీతో పనేంటి?! ఇది అభిమానులను, ప్రేక్షకులకు అర్థం కాని విషయం. అసలు విడిచి కొసరుకు విలువ పెరిగినట్లు, విడుదలైన ఆగడు టీజర్ కన్నా గబ్బర్‌సింగ్, ఆగడుల కంపారిజన్స్, డిస్కషన్స్ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.