ప్రిన్స్ ఆగడు ఫస్ట్‌లుక్ విడుదల
on May 31, 2014
మహేష్ బాబు నటిస్తున్న ఆగడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమానులకు సూపర్ గిప్ఠ్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ చూడగాని ఇందులో మహేష్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ పోస్టర్స్, ఫస్ట్‌లుక్ చూసిన వారికి ఈ లుక్ బెస్ట్ అనిపిస్తుంటే, మరికొంతమందికి పర్లేదనిపిస్తోంది. ఈ చిత్రంలో మొదటిసారిగా ప్రిన్స్ సరసన తమన్నా హీరోయిన్‌గా కనిపించబోతోంది.
సినిమాల ప్రభావం ఎలా వుందో కాని పంచ్ డైలాగ్‌ల ప్రభావం బాగా వుంది. ప్రతోడు పులులు, సింహాలు, ఎలుకలతో కంపారిజనే అని మహేష్ కొత్త తరహాలో పంచ్ డైలాగ్‌లు చెప్పడం టీజర్‌ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తోంది. సినిమాటాగ్రఫి, కొత్త కొత్త లోకేషన్లు, మహేష్ పవర్ ఫుల్ క్యారెక్టరైజషన్ ఇవన్నీటీజర్‌లో అదిరిపోయాయనిపిస్తోంది. ఇవి సినిమా పై అంచనాలు తప్పకుండా పెంచేస్తాయి అనిచెప్పవచ్చు. మహేష్ ఫిజిక్, మహేష్ లుక్స్ మరో సారి మహేష్ మానియాలో అభిమానులు పడిపోతారనిపిస్తోంది. అక్కడక్కడా గబ్బర్‌సింగ్ గుర్తుకు వస్తున్నా ఆగడు ఫస్ట్‌లుక్ సూపర్... సూపర్ స్టార్ కు ఆగడు సూపర్ హిట్ చిత్రం కాగలదని అభిమానులు అప్పుడే ఆనందపడిపోతున్నారు.