రికవర్ అవుతున్నా.. వర్రీ అవ్వాల్సిన పనిలేదు!
on May 3, 2021
కొవిడ్-19తో పోరాడుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను రికవర్ అవుతున్నాననీ, వర్రీ అవ్వాల్సిన పనిలేదనీ తన అభిమానులకు ధైర్యం చెప్పారు. సోమవారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్లో, "హలో ఎవరివన్! కొద్దిపాటి లక్షణాలతో నేను బాగానే ఉన్నాను. బాగానే రికవర్ అవుతున్నా, వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఇంకా నేను క్వారంటైన్లో ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా వైపు మీరు పంపుతున్న ప్రార్థనలకు చాలా థాంక్స్. రుణపడిఉంటాను." అని రాసుకొచ్చారు.
ఈ నెల 28న తనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు బన్నీ. అప్పుడు "హలో ఎవిరివన్! నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంటిలో స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లాను. అన్ని నియమ నిబంధనలను పాటిస్తున్నాను. నన్ను కాంటాక్ట్ అయినవాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండడి. అవకాశం లభించిన వెంటనే వాక్సిన్ వేయించుకోండి. శ్రేయోభిలాషులను, అభిమానులను నా గురించి వర్రీ అవ్వద్దని కోరుతున్నాను. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ప్రేమతో.. అల్లు అర్జున్" అంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన నోట్లో రాసుకొచ్చారు బన్నీ.
అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆరా తీస్తూ వస్తున్నారు. బన్నీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు షేర్ చేస్తున్నారు. దీంతో ఈరోజు తన ఆరోగ్యం గురించిన లేటెస్ట్ అప్డేట్ను ఆయన పంచుకున్నారు.