మహేష్‌లో పిల్లాణ్ణి బయటకు తీసుకొచ్చే శక్తి ఆమెదే!
on May 16, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు చాలా సైలెంట్. సినిమా ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్, మీడియా ముందుకొచ్చిన సందర్భాల్లో సైలెంట్‌గా సెటైర్స్ వేస్తారు. కానీ, పెద్దగా అల్లరి చేసినట్టు ఎక్కడా కనబడదు. అయితే మహేష్ కూడా బాగా అల్లరి చేస్తారని ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ చెబుతున్నారు. కుమార్తె సితారతో కలిసి సూపర్ స్టార్ ఎంత అల్లరి చేసిందీ ప్రేక్షకులకు తెలిసేలా ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో టెడ్డీ బేర్‌తో కలిసి తండ్రికూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
"ప్రేమ, జీవితం, నవ్వులు. మహేష్ బాబు అండ్ సితు పాప టెడ్డీ బేర్ కాన్సర్ట్. ఆయనలో చిన్న పిల్లాణ్ణి సితార మాత్రమే బయటకు తీసుకురాగదు. మంచి మెమరీ థెరపీ ఇది" అని నమ్రతా శిరోద్కర్ మహేష్ పేర్కొన్నారు. ప్రతిరోజూ మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్నారు. దాంతో గతంలో మహేష్ ఫ్యామిలీతో కలిసి ఎంత హక్కటి టైమ్ స్పెండ్ చేసింది, ఎంత అల్లరి చేసింది ప్రేక్షకులకు తెలుస్తోంది.