మహేష్ 'లుంగీ డాన్స్' స్టిల్ లీకైంది
on Dec 16, 2019
ఎప్పుడూ ప్యాంటు ఏసేవాడు... ఇప్పుడు లుంగీ కట్టాడు
ఎప్పుడూ షర్ట్ ఏసేవాడు... ఇప్పుడు జుబ్బా తొడిగాడు
- ఇవీ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మైండ్ బ్లాక్' సాంగులో స్టార్టింగ్ లైన్స్. లిరిక్స్‌కి తగ్గట్టు సాంగులో మహేష్ చేత లుంగీ కట్టించారు. లిరికల్ వీడియోలో చేతికి మల్లెపూలు, జుబ్బాతో మహేష్ ఎలా ఉంటాడో హింట్ ఇస్తూ చిన్న స్కెచ్ లాంటి ఫొటో చూపించారు. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఒరిజినల్ స్టిల్ విడుదల చేసి, అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. ఈలోపు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్‌కి మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో 'మైండ్ బ్లాక్' సాంగ్ షూటింగ్ జరుగుతోంది. లొకేషన్లో మహేష్ లుంగీ కట్టుకుని,జుబ్బా వేసుకున్న ఫొటోను ఎవరో లీక్ చేశారు. దాంతో సినిమా టీమ్ అప్‌సెట్ అయింది. ఏమాత్రం క్లారిటీ లేని ఆ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసంతృప్తితో ఉంది.
'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు యూనిట్ పబ్లిసిటీ ముమ్మరం చేసింది. ఆల్రెడీ రెండు సాంగులు విడుదల చేశారు. 'హి ఈజ్ సో క్యూట్' సాంగ్ ఈ రోజు విడుదల చేయనున్నారు. జనవరి 5న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వనించనున్నారు. ప్రధాన పాత్రలో విజయశాంతి, కథానాయికగా రష్మిక నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.