పరశురామ్ డైరెక్షన్‌లో నాగచైతన్య
on Dec 14, 2019
'వెంకీమామ' మూవీతో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి నాయికగా నటిస్తోన్న ఈ మూవీకి 'లవ్ స్టోరీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది చైతన్యకు 19వ చిత్రం. దాని తర్వాత నటించే తన 20వ చిత్రానికి చైతన్య సంతకం చేశాడు. ఇటీవలే 'గీత గోవిందం' వంటి బ్లాక్‌బస్టర్ మూవీని రూపొందించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించనున్నారు. హరీశ్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తీసిన 'గద్దలకొండ గణేష్' సినిమా తర్వాత ఆ బ్యానర్‌పై నిర్మాణం కానున్న సినిమా ఇదే. 2020 ప్రథమార్ధంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారయ్యే ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవరు నటించేదీ, ఇతర వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు.