నవ తెలంగాణలో మొదలైన బాలకృష్ణ సినిమా
on Jun 2, 2014
నవ తెలంగాణలో మొదలైన బాలకృష్ణ సినిమా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్న, ఈ రోజునేబాలకృష్ణ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. కొత్త దర్శకుడు సత్యదేవా దర్సకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపార వేత్త రుద్రపాటి రమణా రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది.ఈ చిత్ర ఓపెనింగ్ కి చిత్రపరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారయణరావు క్లాప్ కొట్టగా, దర్శకులు రాఘవేంద్రరావు స్విచ్ ఆన్ చేశారు.
ఇక తొలి షాట్ బాలకృష్ణ పంచ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ‘కొందరు కొడితే ఎక్స్-రే లో కనిపిస్తుంది. కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే హిస్టరీలో కనిపిస్తుంది’ అని బాలకృష్ణ తరహా పంచ్ డైలాగ్ ప్రారంభపు షాట్ గా చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్సే’ అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ ఆవిర్భావ సంబరాలతో హైదరబాదు సహా తెలంగాణ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటు ఉంటే బాలయ్య అభిమానులు తమ హీరో కొత్త సినిమా ప్రారంభోత్సవమైనందుకు హుషారుగా ఉన్నారు. ఏమైనా తెలుగు ప్రజలిరివురికి సంతోష వాతవరణం ఇలా మొదలైంది.