నేను చెప్పాల్సిందంతా పోలీసులకు చెప్పా...
on Mar 19, 2020
ట్రెండింగ్ స్టార్ శ్రీరామోజు సునిశిత్ గురించి మాట్లాడడానికి లావణ్యా త్రిపాఠి ఇష్టపడటం లేదు. తనకు తాను శాక్రిఫైజ్ స్టార్ కింద ప్రకటించుకున్న సునిశిత్, యుట్యూబ్ ఛానల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ద్వారా ఒక్కసారి వార్తల్లో నిలిచాడు. 'వన్ నేనొక్కడినే', 'బలుపు' చిత్రాల్లో హీరోగా నటించే అవకాశాలు ముందు తనకు వస్తే... తమ పేరు ప్రతిష్ఠలు ఉపయోగించి మహేష్ బాబు, రవితేజ తనను తప్పించారని అన్నాడు. లావణ్యా త్రిపాఠి విషయానికి వస్తే... ఆమెను 2015లో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కొన్నాళ్లు రిలేషన్షిప్‌లో ఉన్నామని చెప్పాడు. లావణ్య పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోగా, తన పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు.
శ్రీరామోజు సునిశిత్ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులకు లావణ్యా త్రిపాఠి ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ గురించి మాట్లాడాల్సిందిగా ఆమెను మీడియా ప్రతినిధులు సంప్రదించగా "దీని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. మాట్లాడి అతడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చెప్పాల్సిందంతా పోలీసులకు చెప్పా. ప్రస్తుతం నేను కోపంగా ఉన్నాను. ఈ మేటర్ క్లియర్ అయిన తర్వాత నేను పోలీసుల దగ్గరకు ఎందుకు వెళ్లిందీ చెబుతా" అని అన్నారు. సునిశిత్ మీద 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
