ప్రభాస్20 టీమ్ అంతా 14 రోజులు ఇంట్లోనే
on Mar 20, 2020

సెల్ఫ్ క్వారంటైన్... ఇప్పుడీ సౌండ్ ఎక్కువ వినపడుతోంది. విదేశాల నుండి వచ్చినవారు తమకు తాము స్వచ్ఛందంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళుతున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారు. జార్జియాలో ఒక షెడ్యూల్ ముగించుకుని ఇండియా తిరిగొచ్చిన ప్రభాస్20 టీమ్ ఇప్పుడదే పని చేస్తోందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లొచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే, కమెడియన్ ప్రియదర్శి తమను తాము స్వీయ నిర్బంధం చేసుకున్నట్టు తెలిపారు. హీరో ప్రభాస్ సహా మిగతా యూనిట్ సభ్యులు కూడా అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతరులను కలవకుండా సామాజిక దూరం పాటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ ఖబర్. నిజానికి, జార్జియా నుండి తిరిగొచ్చిన టీమ్ అందరూ విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు చేయించుకుని ఇళ్లకు వెళ్లారు. తమవంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు దూరం పాటిస్తున్నారు ఇళ్లకు పరిమితం అవుతున్నారు. తమ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే వారి మంచి మనసును అభినందించాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



