ఓటీటీలో కియారా అద్వాని చిత్రం
on Jul 3, 2021

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న కథానాయికల్లో కియారా అద్వాని ఒకరు. ఈ అమ్మడి చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. `షేర్షా`, `భూల్ భులైయ్యా 2`, `జగ్ జగ్ జీయో`, `మిస్టర్ లేలో` పేర్లతో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. కాగా, వీటిలో `షేర్షా` చిత్రీకరణ పూర్తిచేసుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాని తొలుత జూలై 3న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఆ ఆలోచనని విరమించుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ బయోగ్రాఫికల్ వార్ యాక్షన్ ఫిల్మ్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది.
కాగా, `షేర్షా`ని `బిల్లా` (తమిళ్), `పంజా` చిత్రాల దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కించారు. హిందీలో విష్ణు డైరెక్ట్ చేసిన తొలి చిత్రం `షేర్షా`నే కావడం విశేషం. కరణ్ జోహార్ సహనిర్మాణంలో రూపొందిన `షేర్షా`కి `నేషనల్ అవార్డ్ విన్నర్` ఎ. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు. మరి.. ప్రముఖుల కాంబినేషన్ లో రూపొందిన `షేర్షా`.. వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



