త్రివిక్రమ్ క్లాప్ తో ధనుష్ 'సార్' షురూ!
on Jan 3, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'సార్', తమిళంలో 'వాతి' టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ తో తాజాగా ఈ మూవీ ప్రారంభమైంది.
'సార్' సినిమా ఈరోజు(సోమవారం) ఉదయం 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూవీ హీరో, హీరోయిన్లు ధనుష్, సంయుక్త మీనన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు.

జనవరి 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. జి.వి ప్రకాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్, ఎడిటర్ గా నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



