కృష్ణవంశీ సినిమాల్లో ఆ ఎనిమిది ఉండాల్సిందే!
on Jul 31, 2017
‘కృష్ణవంశీ రోజుల తరబడి సినిమాలు తీస్తాడు?’
‘కృష్ణవంశీకి జడ్జిమెంట్ లేదు?’
‘కృష్ణవంశీ సినిమాకు ఎడిటర్లే దర్శకులు’
‘కృష్ణవంశీ నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు’
‘కృష్ణవంశీ ఆర్టిస్టులను టార్చర్ పెడతాడు’
ఇలా ఒకటా రెండా... కృష్ణవంశీ మీద వచ్చినన్ని విమర్శలు బహుశా ఏ దర్శకునిపై వచ్చి ఉండవేమో. అంతేకాదు... తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని కూడా అంటుంటారు. . ‘గోవిందుడు అందరివాడేలే’విడుదల సందర్భంలో... ‘ఈ సినిమా యాభై ఏళ్లు గుర్తుండిపోతుంది’అని స్టేట్మేంట్ ఇచ్చేసి సంచలనానికి తెరలేపాడు. తీరా ఆ సినిమా వచ్చిందీ తెలీదు, పోయిందీ తెలీదు. దీంతో ఆయన పలు విమర్శలకు గురవ్వాల్సొచ్చింది.
అయితే... ఇన్ని విమర్శలను గుప్పిస్తారా..! ఆయన సినిమా విడుదలైతే మాత్రం తొలి రోజే చూసేయాలని తాపత్రయపడుతుంటారు. కృష్ణవంశీ మాయ అలాంటిది మరి. బాపు సినిమాల్లోని తెలుగుతనం, సూరజ్ భరజాత్య సినిమాల్లోని నిండుతనం, ఆదిత్య చోప్రా సినిమాల్లోని కమ్మతనం, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లోని సహజత్వం.. ఇవన్నీ కృష్ణవంశీ సొంతం.
కృష్ణవంశీ ఒకే తరహా సినిమాలు చేయడు. ఏ తరహా సినిమాలు చేసినా తన మార్క్ ని మాత్రం విడిచిపెట్టడు. ఆయన సినిమాల్లో నటీనటుల ప్రవర్తన, వేష భాషలు, సన్నివేశాల చిత్రీకరణ, నడక.. ఇవన్నీ భిన్నంగా ఉంటాయ్. ఒక్క సీన్ చూడగానే ‘ఇది కృష్ణవంశీ సినిమా’ అని తేలిగ్గా చెప్పేయొచ్చు. అలా తనకంటూ ఓ బ్రాండ్ ని ఏర్పరచుకున్న దర్శకుడాయన. కృష్ణవంశీ సినిమాల్లో ఎనిమిది కామన్ పాయింట్లున్నాయ్. అవి లేకుండా ఆయన సినిమాలు ఉండవ్. వాటి గురించి సరదాగా చర్చించుకుందాం.
1. కృష్ణవంశీ కథానాయికలకు మిగిలిన సినిమాల్లోని కథానాయికలకు చాలా తేడా ఉంటుంది. ముక్కు మీద కోపం, అభిజాత్యం, మూర్తీభవించిన అమాకత్వం, ముగ్థమోహన్ రూపం... వెరసి కృష్ణవంశీ కథానాయిక. ఓ విధంగా చెప్పాలంటే... పురాణాల్లోని సత్యభామను తలపిస్తుంది కృష్ణవంశీ నాయిక.
2. కృష్ణవంశీకి కృష్ణుడంటే ఇష్టం అనుకుంట. తన కథానాయకుల్లో కృష్ణుడే ఎక్కువ కనిపిస్తుంటాడు. ఆయన కేరక్టరైజేషన్ని ప్రేరణగా తీసుకొని హీరో పాత్రను తయారు చేస్తుంటాడు కృష్ణవంశీ.
3. కృష్ణవంశీ సినిమాల్లో కచ్చింతంగా ఉండే మరో అంశం జనాలు. ఆయన సినిమా అంటే తెర నిండా పాత్రలు కనిపించాల్సిందే. సందడి, హంగామా, హడావిడీ ఇవన్నీ కృష్ణవంశీ సినిమాల్లో కామన్. సాధ్యమైనంత వరకూ తెర అంతా కలర్ ఫుల్ గా ఉండేలా
చూసుకుంటారాయన.
4.కృష్ణవంశీ సినిమా అంటే ఓ రొమాంటిక్ సాంగ్ ఉండాల్సిందే. ఆ పాటలో హీరోయిన్ ని స్పైసీగా చూపిస్తాడాయన. అంతేకాదు... ఆ పాటలో కచ్చితంగా హీరోయిన్ ని నీళ్లలో తడుపుతాడు. ‘గులాబీ’నుంచి ‘గోవిందుడు అందరివాడేలే’దాకా ప్రతి సినిమాలో ఆయన చేసిన ఫీట్ ఇది.
5.కృష్ణవంశీని విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’. ఆ సినిమా గుర్తు చేసే ఒక్క సీన్ అయినా, ఒక్క షాట్ అయినా సరే.. కృష్ణవంశీ సినిమాల్లో ఉండాల్సిందే.
6.నటీనటుల నటన విషయంలోనూ కృష్ణవంశీది ఓ భిన్నమైన శైలే. ఆయన సినిమాల్లో క్లోజ్ షాట్స్ ఎక్కువగా ఉంటాయ్. అందుకే... కృష్ణవంశీ సినిమాల్లో నటించే వారికి మంచి పేరొస్తుంటుంది.
7. మేకప్ విషయంలోనూ మిగిలిన సినిమాలకు భిన్నంగానే ఉంటాయ్ కృష్ణవంశీ సినిమాలు. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులకు మేకప్ ఎక్కువ ఉండదు. సాధ్యమైనంతవరకూ లైట్ మేకప్పే ఉంటుంది. అందుకే... కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్లు అందంగా కనిపిస్తారు.
8.కృష్ణవంశీ ప్రతి సినిమాల్లో ఇవే గాక ఇంకో కామన్ పాయింట్ ఉంది. అదే... ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’. ఆయన పాట లేకుండా