వదినమ్మతో పవర్ స్టార్ ముచ్చట్లు
on Jul 31, 2017
పవన్ కళ్యణ్... వదిన కూచి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తనే చెప్పాడు కూడా. తన వదిన సురేఖ మీద అలవిమాలిన అభిమానాన్ని చూపిస్తుంటాడు వపన్. ‘తల్లి తర్వాత తల్లి మా వదిన’అంటూ పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి పెళ్లి చేసుకునేంతవరకూ తన అన్న చిరంజీవి ఇంట్లోనే ఉండేంవాడ్ననీ.... వదిన తనని సొంత కొడుగ్గానే చూసుకునేదనీ పలు సందర్భాల్లో పవన్ చెప్పాడు. అయితే... పెళ్లయ్యాక పవన్ విడిగా ఉండటం మొదలుపెట్టాడు. అన్నావదినలను కలవడం తక్కువైందన్న మాట నిజం. సమయం దొరికినప్పుడు అన్నావదినలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకునేవాడు పవన్. తను బయట ఎంత గంభీరంగా ఉన్నా వదిన దగ్గరకెళ్తే మాత్రం ఆయన చిన్న పిల్లాడిగా మారిపోతారట. రీసెంట్ గా జరిగిన ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె ఎంగేజ్ మెంట్లో చాలాకాలం తర్వాత ఈ వదినా మరిదులు కలిశారు. అంతే.. వదినమ్మ కొంగును విడిచిపెట్టకుండా ఆమె పక్కనే కూర్చొని ముచ్చట్టు చెబుతూ చిన్న పిల్లాడిగా మారిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి త్రివిక్రమ్ తో కలిసి పవన్ ఈ వేడుకకు హాజరయ్యాడు. కానీ... అనుకోకుండా అక్కడ వదిన కనిపించే సరికి... త్రివిక్రమ్ ని కూడా వదిలేసి, వదినమ్మ పక్కకు చేరాడు పవన్. నిజంగా ఆ వదినా మరిదుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయ్ ఈ ఫొటోలు. ఈ సందర్భంగా పవన్ గతంలో చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చరణ్ పుట్టక ముందు సురేఖకు కొడుకైనా మరిదైనా పవనేనట. అంత గారాబంగా చూసుకునేవారట సురేఖ. చరణ్ పుట్టాక కూడా పవన్ ని పెద్ద కొడుగ్గానే భావించేవారట ఆమె. ఫ్యామిలీతో చిరంజీవి టూర్లకు వెళితే.. భార్యా పిల్లలతో పాటు కచ్చితంగా తమ్ముడు పవన్ కళ్యాన్ కూడా ఉండాల్సిందే నట. ఓ సారి ఫారిన్ లోని ఓ స్టార్ హోటల్ లో దిగారట చిరంజీవి అండ్ ఫ్యామిలీ. పిల్లల్ని రూమ్ లోనే పవన్ దగ్గర వదిలేసి చిరంజీవి, సురేఖ బయటకు వెళ్లారట. అలా వెళ్లే సరికి అలిగిన చరణ్... రూమ్ లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేశాడట. దాంతో షాక్ తిన్న పవన్... పాపం తనే రూమంతా శుభ్రం చేస్తూ కూర్చున్నాట. ఈ విషయాన్ని పవన్ పలు సందర్భాల్లో గుర్తుచేసుకుంటుంటారు. ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత... ఇలాంటి ఫొటోలు చూసిన తర్వాత... ఇంకా ఈ అన్నాతమ్ముల పై రూమర్లను సృష్టించడం కరెక్టేనా? ఆలోచించండి.