కూతురి ఫస్ట్ లవర్ గురించి చెప్పిన బన్నీ...
on Aug 1, 2017
అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో... ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జన్, అతని ముద్దుల తనయ అర్హ. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి నిలువెత్తు దర్పణంలా ఉంది కదూ ఈ ఫొటో.
బన్నీ తన కుమార్తెతో సరదాగా ఆడుకుంటుంటే... ఓ ఫొటోగ్రాఫర్ వీరిద్దరినీ క్లిక్ మనిపించాడట. ఆ ఫొటో బన్నీకి తెగ నచ్చేయడంతో.. ఇక ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. బన్నీ అలా పెట్టాడో లేదో... లెక్కలేనన్ని లైక్ లు... వేలల్లో కామెంట్లు, వందల్లో షేర్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫోటోనే. పైగా ఈ ఫొటోతో పాటు బన్నీ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. ‘కుమార్తెకు ఆమె తండ్రే మొదటి ప్రేమికుడు... చిరకాల హీరో కూడా’అనే ఈ క్యాప్షన్ నిజంగా హృదయాలకు హత్తుకునే ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మగపిల్లాడు తల్లికి బాగా దగ్గరగా ఉంటే... ఆడపిల్ల తండ్రికి బాగా చేరువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ ఫొటోలో ఈ తండ్రీకూతుళ్లను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. గత ఏడాది నవంబర్ 21న అల్లు అర్జున, స్నేహారెడ్డి దంపతులకు ముద్దుల అర్హ జన్మించింది. ఈ బంగారు తల్లి పుట్టినప్పట్నుంచీ బన్నీ ఆనందానికి అవధులే లేకుండా పోయాయని ఆంతరంగిక వర్గాల భోగట్ట. ఎక్కువ సమయం కూతురుతోనే గడిపేస్తున్నాడట ఈ స్టయిలిష్ స్టార్.
త్వరలో ‘అర్హ’ తొలి పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ వేడుకను ఇక్కడే చేయాలా? లేక విదేశాల్లో గ్రాండ్ గా జరుపుకోవాలా? అని ఇప్పుడే బన్నీ ప్లాన్స్ వేసుకుంటున్నాడని సమాచారం.
ఎంతైనా కన్నతండ్రి కదా... ఆరాటం అలాగే ఉంటుంది మరి.