Revolver Rita: రివాల్వర్ రీటా.. కీర్తి సురేష్ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?
on Nov 28, 2025

'మహానటి' సినిమాతో నటిగా మరో స్థాయికి వెళ్ళింది కీర్తి సురేష్. అయితే తరువాత ఆ స్థాయికి తగ్గ సినిమాలు దాదాపు రాలేదనే చెప్పాలి. తెలుగులోనూ సినిమాలు బాగా తగ్గించింది కీర్తి. నేడు(నవంబర్ 28) 'రివాల్వర్ రీటా' అనే తమిళ డబ్బింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Revolver Rita)
కీర్తి సురేష్ సినిమా అంటే తెలుగునాట అంతో ఇంతో బజ్ ఉండటం సహజం. కీర్తి నటించిన మూవీ వస్తుందంటే.. చూడటానికి ఆసక్తి చూపించేవారు బాగానే ఉంటారు. కానీ, 'రివాల్వర్ రీటా'పై కనీస బజ్ లేదు. అసలు ఈ మూవీ ఒకటి విడుదలవుతుందనే విషయం జనరల్ ఆడియన్స్ కి పెద్దగా తెలియలేదు.
తెలుగు రాష్ట్రాల్లో 'రివాల్వర్ రీటా' బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఒకట్రెండు స్క్రీన్స్ కూడా కనీస స్థాయిలో ఫుల్ అవలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏ మాత్రం హైప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తే మాత్రమే బాక్సాఫీస్ దగ్గర నిలబడగలదు. ప్రీమియర్స్ రివ్యూలు కూడా గొప్పగా లేవు. చూద్దాం మరి రిజల్ట్ అవుతుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



