'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ కి, కలెక్షన్స్ కి సంబంధం లేదు!
on Nov 28, 2025

'ఆంధ్ర కింగ్ తాలూకా'కి పాజిటివ్ టాక్
టాక్ కి తగ్గట్టుగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయా?
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని నిన్న(నవంబర్ 27) 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో థియేటర్లలో అడుగుపెట్టాడు. సినిమాకి పాజిటివ్ టాకే వచ్చింది. మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా? (Andhra King Taluka)
మాస్ జపం చేసి, గత మూడు సినిమాలతో నిరాశపరిచిన రామ్.. ఇప్పుడు 'బయోపిక్ ఆఫ్ ఫ్యాన్' అంటూ 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించాడు. రామ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది. ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉందనే కామెంట్స్ వినిపించాయి.
ఓవరాల్ గా రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.28 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.4.25 కోట్ల షేర్(రూ.7.65 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.75 కోట్ల షేర్, రెస్టాఫ్ ఇండియా రూ.25 లక్షలు, ఓవర్సీస్ రూ.1.25 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

Also Read: రివాల్వర్ రీటా.. కీర్తి సురేష్ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?
రామ్ గత సినిమాలతో పోలిస్తే.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓపెనింగ్స్ తక్కువే. దీంతో టాక్ కి, కలెక్షన్స్ కి సంబంధం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మూవీ జానర్, గురువారం రిలీజ్ వంటి అంశాలను బట్టి చూస్తే.. ఇవి బెటర్ ఓపెనింగ్స్ కిందే లెక్క.
పైగా 'ఆంధ్ర కింగ్ తాలూకా'కి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పెరిగే అవకాశముంది. ఇక ఓవర్సీస్ లో రామ్ ట్రాక్ రికార్డు కంటే బెటర్ ఓపెనింగ్స్ రావడం మరో కలిసొచ్చే అంశం. ఈ లెక్కన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో రూ.15-20 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



