చికిరి కోసం రామ్ చరణ్ బిగ్ రిస్క్.. వీడియో చూస్తే షాకవుతారు!
on Nov 27, 2025

ఇటీవల కాలంలో సోషల్ మీడియాని షేక్ చేసిన సాంగ్ అంటే 'చికిరి చికిరి'(Chikiri Chikiri) అని చెప్పవచ్చు. 'పెద్ది'(Peddi) నుండి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ఈ సాంగ్, తక్కువ టైంలోనే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అయితే ఈ సాంగ్ సక్సెస్ వెనుక మూవీ టీమ్ కష్టం దాగి ఉంది. 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా.. ఆ కష్టాన్ని తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు మేకర్స్.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం 'పెద్ది'. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'చికిరి' సాంగ్ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్పులకు కూడా మంచి పేరు వచ్చింది.
Also Read: 'ఆదిత్య 999' డైరెక్టర్ చేంజ్.. మోక్షజ్ఞ డెబ్యూకి ముచ్చటగా మూడు!
'చికిరి' సాంగ్ ను పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సాంగ్ కోసం రామ్ చరణ్ తో సహా అందరూ ఎంతో కష్టపడ్డారు. రోప్స్ సహాయంతో రిస్క్ చేస్తూ, ఏకంగా 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి లొకేషన్ కి చేరుకున్నారు. తెరవెనుక అంత కష్టపడుతున్నారు కాబట్టే.. 'చికిరి' రూపంలో ఇంతటి సక్సెస్ వచ్చింది అంటూ మేకింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



